వంటపేరు - ఉప్మా
ఉప్మారవ్వ : పావుకిలో
కావలసిన పదార్ధాలు :
ఉప్మారవ్వ : పావుకిలో
కేరెట్ తురుము : పావుకప్పు
ఎండిమిర్చి : రెండు
ఆవాలు : టీ స్పూన్
సెనగపప్పు : టీ స్పూన్
జీడిపప్పులు : పది
పల్లీలు : కొద్దిగా
నూనె : అరకప్పు
నెయ్యి : టేబుల్ స్పూన్
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లంముక్కలు : 1 కప్పు
కరివేపాకు : కొద్దిగా
తగినంత : ఉప్పు
నిమ్మరసం : టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా
జీలకర్ర : అర టీ స్పూన్
మినపప్పు : టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం :
పసుపు : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచేయ్యాలి.
2) నూనె కాగాక సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక , ఉల్లి, మిర్చి, అల్లంముక్కలు వేసి వేగనివ్వాలి.
3) ఇప్పుడు కేరెట్ తురుము, పసుపు కుడా వేసి వేగనిచ్చి రెండు గ్లాసుల నీళ్ళుపోసి, ఉప్పు కలిపి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూత తీసి రవ్వపోస్తూ బాగాకలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమిర వేసి మూత పెట్టాలి.
* అంతే పసుపు కలర్ ఉప్మా రెడి.
* అంతే పసుపు కలర్ ఉప్మా రెడి.
Post a Comment