మైదా సెనగపిండి మైసూర్ పాక్
కావలసిన పదార్దములు :
మైదా : కప్పు
సెనగపిండి : కప్పు
నూనె : కప్పు
నెయ్యి : కప్పు
పంచదార : నాలుగుకప్పులు
ఎల్లో కలర్ : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె, నెయ్యి వేసి చిన్న మంటమీద కాగనివ్వాలి.
2) రెండో స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టి పంచదార కొద్దిగా నీళ్ళు వేసి పాకం పట్టాలి.
3) తీగపాకం వచ్చాక సెనగ పిండి వేసి ఒకసారి కలిపి మైదా వేసి కలపాలి. రెండు నిముషాలు కలిపి ఎల్లో కలర్ వేసి కలిపి, ప్రక్కస్టవ్ ఆపి కాగిన నూనె నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి.
4) అలా నూనె మొత్తం అయిపోయేవరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నూనె మొత్తం పిండిలో కలిసి పోయి పిండి గుల్లగా అయ్యి కళాయి అంచులు విడుస్తుంది. ఇప్పుడు తయార్య్యనట్లే దీనిని ఒకప్లేటులో వేసుకోవాలి.5) ఒకనిముషం ఆగితే కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేస్తే మైదా మైసూర్ పాక్ రెడీ.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te