వంటపేరు : స్వీట్ పూరీ
కావలసిన పదార్దములు :
మైదా : పావుకేజీ
కొబ్బరికోరు : కప్పు
పంచదార : కప్పు
జీడిపప్పులు, బాదంపప్పులు, నెయ్యి : టేబుల్ స్పూన్
యాలుకల పొడి : అర టీ స్పూన్
నేతిలో వేపిన కేరెట్ తురుము : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) మైదాను కొద్దిగా నెయ్యి, పంచదార పొడి కలిపి నీళ్ళుపోసి ముద్దగా కలిపి
పక్కన పెట్టాలి.
2) జీడిపప్పు, బాదం పప్పులు నేతిలో దోరగా వేపి పక్కన పెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి.
తీగపాకం వచ్చాక కొబ్బరి వేసి కలపాలి.
4) ఇది గట్టి పడుతుండగా నేతిలో వేపిన పప్పులు, యాలుకల పొడి వేసి
కలిపి దించి చల్లార నివ్వాలి.
5) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
6) మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసి ఒక్కోవుండను పూరీలుగా చేసి
కాగే నూనెలో వేసి ఒక నిముషం వేగనిచ్చి తియ్యాలి (మరీ
వేగనివ్వగూడదు)
7) ఇప్పుడు ఒకొక్క పూరీలో కొబ్బరి మిశ్రమం పెట్టి ఆచివర ఈచివర
మడతపెట్టి విడిపోకుండా లవంగం గుచ్చి, కేరెట్ తురుము జల్లాలి.
* ఇలా అన్ని పూరీలు చేసి అతిధులకు అందించటమే.
* అంతే స్వీట్ పూరీ రెడి.

Post a Comment