కావలసిన పదార్ధాలు :
అటుకులు : కేజీ
నూనె : అర కేజీ
కారం : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడ
కరివేపాకు : కప్పు
వేరుసెనగ గుళ్ళు : అరకేజీ
జీడిపప్పు : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి కాగిన తరువాత, వేరుసెనగ గుళ్ళు, జీడిపప్పు వేపి పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు అదే నూనెలో అటుకులు కొంచెం, కొంచెంగా వేసి వేగిన తరువాత, పేపర్ పరిచిన పళ్ళెంలోకి తియ్యాలి.
{అటుకులు నూనెలో వెయ్యగానే అప్పడాలులా పైకి తేలుతాయి}
3) అలా అన్ని అటుకులు వేపుకోవాలి.
4) ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు వేపాలి.
5) ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక పళ్ళెంలోకి వేపిన అటుకులు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, కారం, ఉప్పు వేసి అన్నీ కలపాలి.
* ఒకడబ్బాలో వేసి గాలి తగులకుండా జాగ్రత్త చెయ్యాలి.
* ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
* ఇవి చాలా రోజులు కరకరలాడుతూ ఉంటాయి.
Post a Comment