సగ్గుబియ్యం వడలు (Saggubiyyam Vadalu)

వంటపేరు : సగ్గుబియ్యం వడలు


కావలసిన పదార్దములు :


సగ్గుబియ్యం : 1 కప్పు
మైదా : మూడు టేబుల్ స్పూన్లు
బియ్యపుపిండి : అరకప్పు
పెరుగు  : 1 కప్పు
మజ్జిగ : రెండు కప్పులు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్
కరివేపాకు : గుప్పెడు
జీలకర్ర : టీ స్పూన్ 
వంట సోడా : చిటికెడు
ఉప్పు : తగినంత                                                                      
నూనె : వేయించటానికి సరిపడా


తయారుచేయు విధానం :


1) సగ్గుబియ్యాన్ని ఐదుః గంటలు మజ్జిగలో నానబెట్టాలి.
2) తరువాత వీటికి పైన చెప్పిన ఉల్లిముక్కలు, మిర్చిపేస్తూ, జీలకర్ర, పెరుగు, 
    వంటసోడా, ఉప్పు, కరివేపాకు ముక్కలు, మైదా, బియ్యపుపిండి, కొత్తిమీర 
    తరుగు, అల్లం రసం అన్ని కలిపి ముద్దలా చెయ్యాలి.
3) స్టవ్ మీద నూనె వేడిచేయ్యాలి, సగ్గుబియ్యపు ముద్దని చిన్న చిన్న 
    ఉండలుగా చేతిలోకి తీసుకోని వడలుగా వత్తి కాగే నూనెలో దోరగా వేపాలి.


* అంతే వేడివేడి సగ్గుబియ్యం వడలు రెడి.