కేరెట్ ఇడ్లి (Carrot Idly)

వంటపేరు : కేరెట్ ఇడ్లి 

కావలసిన పదార్ధాలు :

ఇడ్లి రవ్వ : పావుకేజీ                                        
కేరెట్లు : రెండు( తురిమాలి )
కొత్తిమిర తరుగు : ఒక కప్పు 
పచ్చిమిర్చిపెస్టు : టేబుల్ స్పూన్  
ఉప్పు : సరిపడా 
మినపప్పు : వందగ్రాములు
వంటసోడా : చిటికెడు 

తయారుచేయు విధానం :


1) మినపప్పు మూడుగంటలు ముందు నానబెట్టి మెత్తగా రుబ్బాలి.
2) రుబ్బిన పిండిలో ,కడిగి నీళ్ళుపిండిన రవ్వ ,కొత్తిమిర .ఉప్పు, మిర్చిపేస్టూ, 
    కేరెట్ తురుము, సోడా వేసి కలిపి రెండు గంటలు పక్కనపెట్టాలి.
3) స్టవ్ మీద కొద్దిగా నీళ్ళు పోసి ఇడ్లి పాత్రను పెట్టి, ఇడ్లి రేకుల్లో ఈ పిండిని 
    కొద్దికొద్దిగా వేసి మూతపెట్ది ఉడకనివ్వాలి.


* పది నిముషాల్లో కేరెట్ ఇడ్లి రెడి.