మామిడి ఐస్ క్రీం (Mango Ice Cream in telugu Mamidi Ice Cream)

మామిడి ఐస్ క్రీం


కావలసిన పదార్ధాలు :


పాలు : రెండు కప్పులు
క్రీం : కప్పు
పంచదార : కప్పు
ఐస్ క్రీం పొడి : పావు కప్పు
మామిడి పళ్ళు : మూడు


తయారుచేయు విధానం :


1) స్టవ్ మీద పాలు పెట్టి కాచు కోవాలి. మామిడి పళ్ళు గుజ్జుతీసుకోవాలి.
2) కాగిన పాలల్లో మామిడిగుజ్జు, ఐస్ క్రీంపొడి, పంచదార, క్రీం కలిపి చిన్నమంటమీద మరిగించాలి.
3) ఇప్పుడు దించి చల్లార నివ్వాలి. అలా చల్లారిన మిశ్రమం ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిజ్ లో గట్టిపడే వరకు ఉంచాలి.
4) ఇప్పుడు ఐస్ క్యూబ్స్ లా మారిన ఈ మిశ్రమాన్ని మిక్సి లో వేసి మిక్స్ చెయ్యాలి. (నీళ్ళు కలపగూడదు)
5) దీనిని మళ్ళీ  డీప్ ఫ్రిజ్ లో నాలుగు గంటలు ఉంచి  మళ్ళీ  మిక్సి లో వేసి ఒకసారి తిప్పితే మెత్తటి మామిడి ఐస్ క్రీం రెడీ.