చీజ్ పకోడీ (Cheez Pakoda in telugu Panneer Pakodi)

వంట  పేరు : చీజ్ పకోడీ 


కావలసిన పదార్దములు :


చీజ్ ముక్కలు : మూడు 
బ్రేడ్ ముక్కలు : మూడు 
శెనగపిండి : పావుకిలో 
ఉప్పు : సరిపడా 
పచ్చిమిర్చి : రెండు 
ఉల్లిముక్కలు : కప్పు
కరివేపాకు : కొద్దిగా 
నూనె : వేయించటానికి సరిపడా 
చాట్  మసాల : చిటికెడు 


తయారుచేయు విదానం :


1)  చీజ్ ను చిన్నముక్కలు చేసుకోవాలి. అలాగే బ్రెడ్ ను కూడా చిన్నముక్కలుగా చేసుకోవాలి.
2)  ఒక గిన్నెలో చీజ్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, ఉల్లి ముక్కలు, కరివేపాకు, కార్న్ ప్లోర్, శెనగ పిండి వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలపాలి.
3) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక కలిపిన పిండిని పకోడిలా వేసి దోరగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.
4) వీటిమీద చిటికెడు చాట్ మసాల జల్లి సర్వ్ చేయాలి. కావాలంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు.