కావలసిన పదార్దాలు
మామిడి కాయలు _ మూడు
పెసరపప్పు _వంద గ్రాములు
ఉప్పు _ సరిపడా
నూనె _ పావుకేజీ
కారం _ వంద గ్రాములు
తయారుచేయు విధానం
1) ముందుగా మామిడి కాయలు ముక్కలుగ కట్ చేయాలి.
2) పెసరపప్పు బాగా ఎండబెట్టి పొడి చేయాలి.
3) ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో పెసరపిండి, కారం, ఉప్పు వేసి మూడు కలిసేలా బాగా కలపాలి.
4) ఇప్పుడు దీనిలో మామిడి ముక్కలు ,నూనె వేసి బాగా కలిపి జాడీలో పెట్టుకోవాలి.
5) మూడో రోజు ఒకసారి బాగా కలిపి వాడుకోవడమే
ఇంతే ఎంతో రుచిగా ఉండే పెసర ఆవకాయ రెడి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te