పనీర్ రైస్ (Paneer Rice in Telugu )



కావలసిన పదార్దాలు 

బాస్మతి రైస్ : పావుకేజీ
పనీర్ : వంద గ్రాములు 
యాలుకలు : నాలుగు 
లవంగాలు: నాలుగు 
దాల్చినచెక్క : చిన్న ముక్క 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు 
రోజ ఎసెన్స్ : ముడు చుక్కలు 
మషాలా : టీ స్పూన్ 
పసుపు : చిటికెడు 
కొత్తిమీర : కట్ట 
పెరుగు : చిన్న కప్పు 

తయారుచేయు విధానం 

1) ముందుగా పన్నీరు పొడవుగా ముక్కలుగాకట్ చెయ్యాలి.ఒక గిన్నెలో నీళ్ళుపోసి పసుపువేసి  దానిలో పనీర్ ముక్కలు వేసి గంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై రైస్ కు సరిపడా నీళ్ళు మరగబెట్టి దానిలోయాలుకులు, లవంగాలు, దాల్చినచెక్క ,ఉప్పు వేసి మరిగించాలి.
3) నీళ్ళు మరిగిన తరువాత కొద్దిగా రైస్ వేసి దానిమీద పనీర్ ముక్కలు పరిచి దానిమీద మళ్ళిరైస్ పోసి దానిమీద ఎసెన్స్, మసాలా, పెరుగు, నెయ్యి  వేసి కొద్దిగా కలిపి చిన్న మంటమీద ఇరవైనిముషాలు ఉడికించాలి.
ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి వడ్డీచాలి.