Atukula Halwa (అటుకుల హల్వా)

కావలసిన పదార్థాలు :

అటుకులు : నాలుగు కప్పులు
పంచదార : ఒక కప్పు 
నెయ్యి : కప్పు 
పాలు : రెండు కప్పులు 
యాలకుల పొడి : చిటికెడు
కుంకుమ పువ్వు : : కొంచెం 
జీడిపప్పు, బాదం, పిస్తా : అరకప్పు 



తయారుచేయు విధానం :

1) కడాయిలో కొద్దిగా నెయ్యి పోసి అందులో అటుకులను దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి.

2) మరో గిన్నెలో పాలు కాచి అందులో కుంకుమపువ్వు వేసి , ఇందులో వేయించిన అటుకుల్ని వేసి ఉడికించాలి.

3) అటుకులు కాస్త ఉడికాక పంచదార, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. 

4) ఇప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తాలను తయారయ్యిన హల్వా లో వేసి కలిపి, యాలకుల పొడి చల్లి దించేయాలి.

అంతే ఎంతోరుచిగా ఉండే అటుకుల హల్వారెడి.