బంగాళాదుంపల దోశ (Aloo Dosa in Telugu )

కావలసిన పదార్ధాలు :

బంగాళా దుంపలు - మూడు
ఉల్లిపాయలు  - రెండు  

మైదా - కప్పు
మిరియాలపొడి - పావు టీ స్పూన్‌
ఉప్పు - తగినంత
నూనె - అరకప్పు
బేకింగ్‌ సోడా - ఒక చిటికెడ్‌

తయారు చేయు విధానం 
:


1) బంగాళాదుంపలు చెక్కి తురుముకోవాలి.అలాగే ఉల్లిపాయల్ని తురుముకోవాలి.వీటిని ఒక గిన్నెలో కలిపి పక్కన పెట్టాలి.
2) వేరే గిన్నెలో మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్‌ సోడాలను కలుపుకోవాలి. 
అందులో కలిపి పెట్టుకున్నబంగాళా దుంపల తురుము, ఉల్లి తురుమును కలిపి తగినన్ని నీళ్ళు పోసి గరిట జారుగా కలుపుకోవాలి. 
3) తర్వాత పొయ్యి మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి అది వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్ అంతా అంటుకునేలా గరిటతో తిప్పాలి.
4) తర్వాత ఒక గుంట గరిటెతో పిండిని తీసుకుని దోశలా పాన్ మీద పోయాలి. కాస్త మందంగా వేస్తేనే బాగుంటుంది.
రెండు నిమిషాలు కాలనిచ్చి దానిని రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా కాలనివ్వాలి.