కావలసినపదార్దాలు:మామిడి ముక్కలు : ఐదు కేజీలు
ఉప్పు: పావు కేజీ గ్లాసుతోమూడు గ్లాసులు ,
కారం : మూడు గ్లాసులు
ఆవాలపొడి : మూడు గ్లాసులు ,
మెంతి పొడి :
వెల్లుల్లి : అర కేజీ
పసుపు : రెండు టేబుల్ స్పూన్స్
నూనె : రెండు కేజీలు
తయారు చేయు విదానం :
తయారు చేయు విదానం :
1) ఒక పళ్ళెంలో ఉప్పు ,పసుపు, కారం, ఆవపిండి, మెంతి పిండి, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి .
2) ఒక గిన్నె లో నూనె పోసి పెట్టుకోవాలి. మామిడి ముక్కలు నూనె లో వేసి, కలిపి పెట్టుకున్న కారం పొడి లో వేసి కారం బాగా ముక్కలకు పట్టేటట్లు అద్ది ఒక జాడి లోపెట్టుకోవాలి. పైన నూనె పోసి మూత పెట్టి ఉంచాలి.
3) రెండు రోజుల తరువాత గరిటెతో పచ్చడి కలపాలి.
4) ఇలా చెయ్యడం వల్ల నూనె పైకి తేలుతుంది.
5) మూడవ రోజు ముక్కలు ఒక పెద్ద గిన్నెలో వేసి పచ్చడి పైకి క్రిందకి బాగా కలిసేటట్లు కలిపి ఉప్పు సరి చూసుకుని అవసరమైతే మరి కొంచెం ఉప్పు కలిపి జాడీలో అడుగున కొద్దిగా నూనె పోసి పచ్చడి జాడీలో పెట్టాలి.
6) పైన మళ్లీ నూనె పోసి మూత గట్టిగా పెట్టి పైన ఒకపలుచని క్లాత్ కట్టాలి. సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా బాగుంటుంది.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te