కావాల్సిన పదార్దాలు :
కైమా : అరకేజి
మైదాపిండి : అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు : రెండుటీ స్పూన్లు
పుదినా : ఒక కట్ట
ఉప్పు తగినంత ,
కారం : టీ స్పూన్లు ,
కొత్తిమీర : ఒక కట్ట ,
గరం మసాల : ఒక టీ స్పూన్
నూనె : వేయించడానికి సరిపడినంత
ఉప్పు తగినంత ,
కారం : టీ స్పూన్లు ,
కొత్తిమీర : ఒక కట్ట ,
గరం మసాల : ఒక టీ స్పూన్
నూనె : వేయించడానికి సరిపడినంత
తయారుచేయు విధానం :
ముందుగా మైదా పిండి లో కొంచెం
నెయ్యి ,కొంచెం ఉప్పు వేసుకొని చపాతీ పిండిలా కలిపి అర గంట పక్కన పెట్టాలి . కీమ బాగా కడిగి నీళ్ళు గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి .కీమ లో పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. బాణాలి లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు , పుదీనా వేసి వేగనివ్వాలి. కీమ వేసి బాగా వేయించాలి .
ఉప్పు,కారం , గరం మసాల వేయాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి . చపాతి పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పురిలా వత్తాలి. పూరి పెనం పైన వేసి ఒక నిమిషం వేడి చెయ్యాలి .పూరిని రెండు సగాలుగా కట్ చేసి ఒక్కొక్క పీస్ మీద కూర పెట్టుకొని 'v' ఆకారంలో చేసుకొని మైదా కలిపిన నీళ్ళతో అతికించాలి .ఇలా చేసుకున్న సమోసాలు వేడి నూనెలో
వేయించాలి.వేడి వేడి కీమ సమోసా రెడీ
వేయించాలి.వేడి వేడి కీమ సమోసా రెడీ

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te