రాగి లడ్డు (Raagula Laddu in Telugu)

కావలసినపదార్దాలు  :


రాగి పిండి : పావుకిలో
నువ్వులు : 50గ్రా
వేరుసెనగ పప్పు : 50గ్రా
బెల్లం : పావుకిలో
నెయ్యి : పావు కేజీ 

తయారు చేయు విధానం  :
 
1) ఒక బాణలి తీసుకొని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి రాగి పిండి కూడ వేసి కలుపుతూ వేయించాలి.
2) వేరుసెనగ పప్పు, నువ్వులు కూడా విడి విడిగా వేయించి పొడి చేసి ఉంచాలి.
3) బెల్లం సన్నగా తురమాలి.
4) ఇవన్నీఒక గిన్నెలో వేసి నెయ్యి వేసి బాగా కలిపి ఉండలుగా చుట్టాలి.
 రెండు గంటలు గాలికి ఆరనిచ్చి డబ్బాలో పెట్టుకోవాలి.
అంతే రాగి లడ్డు రెడీ .