కిమా పలావ్ ( Keema Pulao in Telugu )



కీమా పలావ్
కావలసిన పదార్దాలు

బియ్యం : అరకిలో
కీమా : కప్పు
కారం : టీ స్పూన్
ఉల్లి ముక్కలు : అర కప్పు
పచ్చిమిర్చి  : ఆరు
ఉప్పు : తగినంత
డాల్డా : పావుకప్పు
పుదినా :  చిన్నకట్ట
చెక్క,లవంగా,యాలుకలు : కొద్దిగా
అల్లం వెల్లుల్లి : టేబుల్ స్పూన్
కొత్తిమీర : కట్ట
అనాస పువ్వు : కొద్దిగా
పలావు ఆకు : రెండు
తయారుచేయు విధానం :

1) బియ్యం కడిగి నీళ్ళు వంచి పక్కన పెట్టాలి.
2) కిమాలో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి.
3) ఇప్పుడు స్టవ్ ఫై గిన్నె పెట్టి డాల్డా వేడి చెయ్యాలి.
4) డాల్డా వేడి అయ్యాక మసాలాలు వేసి తరువాత  ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
5) తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉడికించిన కీమా వేసి కాసేపు వేయించాలి.
6) ఇప్పుడు కారం,ఉప్పు,పుదీనా,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
7)  బియ్యం వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి.
8) ఇప్పుడు మూత తీసి తయారయ్యిన పలావ్ లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి.
అంతే కీమా పలావ్  రెడీ