చెమ దుంపలు కూర ( Chamadumpa Curry in Telugu )


చామ దుంప కూర 

చామ దుంపలు : పావుకిలో 
ఉల్లిపాయలు : రెండు 
టమోటాలు - 2 సన్నగా తరిగినది
అల్లం వెల్లుల్లి పేస్టు - టీ స్పూన్ 
పసుపు - పావు టీ స్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు: సరిపడా 
తయారు చేసే విధానము
1) చామదుంపలు కుక్కర్ లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడక పెట్టాలి.
2) తరువాత  తొక్కు తీసి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
3) ఒక బాండలి లో కొంచం నూనె పోసి వేడి చేసుకోవాలి.అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
4) వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు , టమోటాలు వేసి వేగించాలి.
5) అందులో కొంచం పసుపు , ఉప్పు కూడా వేయాలి. 
6) కొంచం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
7) ఉడికిన తరువాత  అందులో తగినంత కారం వేసి ఒక ఐదు నిముషాల పాటు ఉడక నివ్వాలి. 
అంతే చామ గడ్డ కూర తయారు.