
కావలసిన పదార్దాలు :
పనీర్ : 300g
నెయ్యి : 500g
మైదా : 2)tebul spuns
పంచదార : 250g
యాలుకలుపొడి : tea spun
కుంకుమపువ్వు : pavu tea spun
తయారుచేయు విధానమ్ :
1) పనీర్‌ను మెత్తగా చేసి దానిలో మైదా, యాలుకులుపొడి వేసి కలిపి
కొద్దికొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా కలపాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడి చెయ్యాలి.
3) ప్రక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో పంచదార వేసి
ఒకగ్లాస్ నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి.
4) ఈ పాకంలో కుంకుమపువ్వు వేసి స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు కలిపిన పనీర్ ముద్దను జిలేబీలు వేసే క్లాత్ లో వేసి
కాగే నేతిలో జిలేబిల్లా గుండ్రంగా వేయ్యాలి.
6) రెండు ప్రక్కలా దోరగా వేయించి పంచదార
పాకంలో వెయ్యాలి.
7) పాకంలో ఐదు నిముషాలు ఉంచి తీసి ఒక ప్లేటులోకి పెట్టి సర్వ్
చేయాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే పనీర్ జిలేబి రెడీ.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te