నూడిల్స్ పకోడీ (Noodles Pakodi Preparation in Telugu)


కావలసిన పదార్దాలు:

నూడిల్స్ : పావుకిలో
బియ్యప్పిండి : రెండు టేబుల్ స్పూన్లు
శెనగ పిండి : రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు : రెండు 
పచ్చిమిర్చి : రెండు
అల్లం : చిన్న ముక్క
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమీర : పావు కప్పు
ఉప్పు : తగినంత
కారం : టీ స్పూన్
 పసుపు :కొద్దిగా
వంటసోడా : పావు టీ స్పూన్
నూనె : వేయించటానికి 

తయారుచేయు విధానం : 

1) నూడిల్స్ ఉడికించి నీళ్ళు వంచి పక్కన పెట్టాలి.
2) ఉల్లి పాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలుగా కొయ్యాలి.
3) ఒక గిన్నెలో బియ్యప్పిండి, శెనగ పిండి, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, వంటసోడా, పసుపు వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ వేసి కలపాలి.అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపాలి.
5) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
 6) నూనె కాగాక ఈ పిండిని పకోడిల్లా  వేసి బాగా వేగనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి.