పనీర్ బజ్జి (Panneer Bajji)

కావలసిన పదార్దాలు :

పచ్చిమిర్చి పెద్దవి : పది
శెనగపిండి : కప్పు
పనీర్ :అర కప్పు
ఉడికించిన ఆలూ : ఒకటి
అల్లం పేస్టు : టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా
కారం : టీ స్పూన్
కొత్తిమీర : టేబుల్ స్పూన్
వంట సోడా : చిటికెడు

తయారుచేయు విధానం :

1) పచ్చిమిర్చి నిలువుగా గాటు పెట్టి లోపలి గింజలు తీసేయ్యాలి.
2) పనీర్ ముక్కలు, ఆలూమెత్తగా చేసి దానిలో కొద్దిగా ఉప్పు, కొత్తిమీర,  అల్లం వేసి కలిపి ఈ మిశ్రంమాన్ని పచ్చిమిర్చిలో పెట్టి పక్కన పెట్టాలి.
3) శెనగ పిండిలో ఉప్పు, కారం, వంటసోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి జారుగా బజ్జిలా పిండిలా కలపాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. 
5)  ఇప్పుడు పనీర్ మిశ్రమం నింపిన మిరపకాయలు ఈ శెనగ పిండిలో ముంచి కాగే నూనెలో వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
అంతే పనీర్ బజ్జి రెడీ.