కృష్ణాజిల్లా గోంగూర బండ పచ్చడి (Gongura Banda Pachhadi in Telugu)

కావలసిన పదార్దములు


గోంగూర - చిన్నకట్టలు ఐదు 
ఎండిమిర్చి  -పది హేను 
ఉల్లుపాయలు - రెండు 
ఉప్పు - సరిపడా 
చింతపండు - ఉసిరి కాయంత 
జీలకర్ర - టీ స్పూన్ 
వెల్లుల్లి రేకలు - ఏడు 
నూనె రెండు - టీ స్పూన్లు 
పోపుగింజలు - టీ స్పూన్ 
కరివేపాకు - రెండు రెమ్మలు 


తయారుచేయు విధానం 

1) గోంగూరను కోసి శుబ్రంగా కడిగి నీళ్ళు మొత్తం పోయేలా చేయాలి.
2) నూనె వేడిచేసి ఎండి మిర్చి  వేయించాలి.అదే నూనెలో గోంగూర వేసి వేయించాలి. 
3) వేయించిన ఎండిమిర్చికి  ఉప్పు,చింతపండు,వెల్లుల్లి,జీలకర్ర కలిపినూరాలి.కాస్త నలిగిన తరువాత గొంగూర వేసి నూరి
 తరువాత  ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా నూరాలి.
4) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు,ఎండిమిర్చి,కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి.
అంతే గోంగూర బండ పచ్చడి రెడీ.  
ఈ పచ్చడి అప్పటి కప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.