చెక్కెర కోవా లడ్డు (Sugar Kova Laddu in Telugu)

కావలసిన పదార్దాలు  

పచ్చికోవా : పావుకేజీ 
మైదా :  కప్పు 
పాల విరుగుడు : కప్పు 
జాపత్రి పొడి : పావు టీ స్పూన్ 
రెడ్ ఫుడ్ కలర్ : చిటికెడు 
పంచదార : ముప్పావుకేజి
నూనె : అరకేజీ 
జీడిపప్పులు : అర కప్పు 


తయారుచేయు విధానం :

1) తాజా కోవాలో మైదా,పాలవిరుగుడు  వేసి బాగా కలపాలి.
ఫుడ్ కలర్,జాపత్రి పొడి  వేసి మరోసారి కలపాలి.
2) ఈ కలిపిన కోవా ఉండగాచుట్టేముందు  మద్యలో జీడిపప్పు ముక్కలు ఉంచిమూడు అంగుళాల పొడవుగా  ఉండగా చుట్టండి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యండి.అలాగే పక్క స్టవ్ ఫై పంచదార పాకం పట్టండి.
4) ఇప్పుడు కాగే నూనెలో ఈ వుండలు వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించండి.వేగిన వెంటనే తీసి పాకంలో వేయండి.
5)ఒక ప్లేటులో కప్పు పంచదార వేసి ఉంచండి, రెండు గంటల తరువాత ఈ వుండలు బయటకు తీసి పంచదారలో దొర్ల్లించండి.
అంతే కోవా చెక్కెర లడ్డు రెడీ.