క్యారెట్ అన్నం (Carrot Rice in Telugu)


కావలసిన పదార్దాలు 
బియ్యం - రెండు పెద్ద గ్లాసులు
క్యారెట్ తురుము - రెండు కప్పులు
ఉల్లి - ఒకటి 
శెనగపప్పు - టేబుల్ స్పూన్ 
మినప్పప్పు - టేబుల్ స్పూన్ 
ఆవాలు, జీలకర్ర, గరం మసాలా - తగినంత
వేయించిన వేరు శెనగ - రెండు టేబుల్ స్పూన్లు 
కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు - తగినంత
నూనె - రెండు టేబుల్ స్పూన్లు


తయారుచేయు విధానం :


1)  బియ్యం లో తగినంత ఉప్పు కలిపి అన్నం వండుకోవాలి. 
ఉడికిన అన్నం ఓ ప్లేటులో వేసుకుని ఆరబెట్టాలి. 2) స్టవ్‌పై కళాయి పెట్టి, నూనె కాగబెట్టాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వెయాలి. 
3) అందులోనే శెనగపప్పు, మిన పప్పు వేసి వేయించాలి. తర్వాత ముక్కలు చేసిన పచ్చి మిరపకాయలు, ఉల్లి ముక్కలు కలపాలి.
4) తరువాత క్యారెట్ తురుము వేసి క్యారెట్ బాగా కలిసిన తర్వాత గరం మసాలా పొడి వేసి, పావు కప్పు నీళ్లు పోసి, క్యారెట్‌ను ఉడికించాలి .
5) ఇప్పుడు ఉడికించిన క్యారెట్ మిశ్రమాన్ని అన్నంలో కలిపి 
దీనిలో వేయించిన వేరుశెనగ పప్పులు,కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి సర్వ్ చెయ్యాలి.