రవ్వ స్వీట్ (Ravva Sweet in Telugu




కావలసిన పదార్దాలు :


వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు -
అర కప్పు ,
ఖర్జూరం - పది
మైదా - అర కేజీ
డాల్డా - వంద గ్రాములు
రవ్వ - రెండొందల గ్రాములు
పంచదార -మూడు వందల గ్రాములు
నీళ్లు- పావు లీటరు
నూనె - వేయించడానికి తగినంత.
నెయ్యి : పావు కప్పు 

తయారుచేయు విధానం :


1) మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తని చపాతి పిండిల కలిపి పక్కనుంచాలి.
2) కళాయి లో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి.
3) అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వ వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి.
4) దీనిలో  పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి.
5) కళాయి లో నూనె పోసి, వేడి చేయాలి. కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి,
మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి లోపలి మిశ్రమం కనిపించకుండా అంచులు మూసేయాలి.
6) ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి.