వంకాయ పచ్చడి (Vankaya Pachchadi / Brinjal Chutney)

వంటపేరు : వంకాయ పచ్చడి




కావలసిన పదార్ధాలు :


వంకాయలు : పెద్దవి రెండు
పచ్చిమిర్చి : పది
జీలకర్ర : 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
చింతపండు : నిమ్మకాయంత
పోపుదినుసులు : 1 టేబుల్ స్పూన్
నూనె : రెండు టేబుల్  స్పూన్లు
ఉప్పు : సరిపడ
ఉల్లిపాయ : ఒకటి




తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి వంకాయలు కాల్చి తొక్కతీసి ఉంచాలి.
2) కళాయిలో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేపి తీసి, మిర్చి, జీలకర్ర, 
3) ఉప్పు, వెల్లుల్లి కలిపి మెత్తగా నూరాలి.
4) ఇప్పుడు చింతపండు వేసి నూరాలి, తరువాత కాల్చిన వంకాయలు 
    ఉల్లిపాయ వేసి నూరాలి.
5) ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, 
    కరివేపాకు వేసి వేగాక, నూరిన వంకాయ పచ్చడి వేసి తాలింపు పెట్టాలి. 


* అంతే వంకాయ పచ్చడి రెడి.