కారం సెనగపప్పు (Kaaram Senagapappu / Spicy Bengaldal)

వంట పేరు : కారం సెనగపప్పు


కావాలసినవ పదార్ధాలు :


సెనగపప్పు : అర కిలో
కరివేపాకు : 1 కట్ట
కారం : 1 టీ స్పూన్
ఉప్పు : సరిపడ
జీలకర్ర పొడి : 1 టీ స్పూన్
నూనె : వేపటానికి సరిపడ




తయారుచేయు విధానం :


1) సెనగపప్పును మూడు గంటలు నానబెట్టాలి. నానిన తరువాత నీటిలో 
    నుండి తీసి పొడి బట్ట మీద ఆరబెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. కాగిన నూనెలో 
    తడి ఆరిన సెనగ పప్పును వేసి కరకరలాడేలా వేపి ఒక పళ్ళెంలో 
    పొయ్యాలి.
3) అదే నూనేలో కరివేపాకు వేపి తియ్యాలి, ఇప్పుడు స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు  ఉప్పు, కారం, జీలకర్ర పొడి, వేపిన కరివేపాకు నలిపి వేగిన 
    సెనగపప్పులో కలపాలి.


* అంతేకరకర లాడే కారం సెనగపప్పు రెడి.


* ఇలాగే మినుములు, పెసలు, బొబ్బర్లు, సోయా గింజలుతో(సోయగింజలు 
   ఆరు గంటలు నానబెట్టాలి) కుడా చేసుకోవచ్చు.