తెలగపిండి పచ్చిసెనగపప్పు కూర (Telagapindi Pachhi-Senagapappu Curry in Telugu)

వంటపేరు : తెలగపిండి పచ్చిసెనగపప్పు కూర 


కావలసిన పదార్ధాలు : 


పచ్చి సెనగ పప్పు : పావుకేజీ 
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు 
జీలకర్ర : అర టీ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
వెల్లుల్లి : నాలుగు రెబ్బలు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : అర టీ స్పూన్
తెలగపిండి : వంద గ్రాములు


తయారుచేయు విధానం :


1) సెనగపప్పు కడిగి పావుగంట నానబెట్టాలి.
2) ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, 
    వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, ఉల్లిముక్కలు, మిర్చి ముక్కలు వేసి 
    వేపాలి.
4) తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, పసుపు, కారం వేసి కలిపి 
    సెనగపప్పు వేసి బాగా కలిపి, సరిపడా నీళ్ళుపోసి మూతపెట్టి 
    ఉడకనివ్వాలి.
5) పది నిముషాలు ఉడికిన తరువాత ఉప్పు, రాళ్ళు లేకుండా శుబ్రం 
    చేసిన తెలగపిండి వేసి సింలో అయిదు నిముషాలు ఉడకనివ్వాలి. 
6) ఇప్పుడు కూర పొడిపొడిగా అయ్యి తినటానికి రెడీగా వుంటుంది.
     (కావాలంటే నిమ్మకాయ పిండు కోవచ్చు)


* అంతే తెలగపిండి, సెనగపప్పు కూర రెడి.