మేక తలకాయమాంస రసం (Mutton Paya in telugu Meka Talakaya Mamsam)

వంటపేరు : మేక తలకాయమాంస రసం


కావలసిన పదార్ధాలు :


మేకతలకాయ మాంసం : అరకేజీ
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
అల్లంవేల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
కారం : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత 
పసుపు : అర టీ స్పూన్
గరం మసాల : 1 టీ స్పూన్
టమాటా : ఒకటి
కొత్తిమిర : చిన్న కట్ట
దనియాల పొడి : 1 టీ స్పూన్
గసాల పేస్ట్ : 1 టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) తలకాయ మాంసం (మేక కాళ్ళుకూడా) కడిగి ఉప్పు, కారం, పసుపు, 
    అల్లంవెల్లుల్లి, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమిర, గసాల పేస్ట్ వేసి బాగా 
    కలిపి అర గంట పక్కన పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి వేడిచేయ్యాలి.
3) నూనె కాగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, 
    అల్లంవెల్లుల్లి వేసి కాసేపు వేపాలి.
4) టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనిచ్చి, అన్నీ కలిపినమాంసం వేసి ఒక 
    నిముషం కలిపి, లీటరు నీళ్ళువేసి మూతపెట్టాలి.
5) అరగంట (విజిల్ పెట్టకూడదు) ఉడకనివ్వాలి.
6) ఇప్పుడు అర లీటరు రసం వరకు వచ్చాక, గరం మసాల, కొత్తిమిర వేసి 
    మూత పెట్టి స్టవ్ ఆపాలి.


* అంతే మేకమాంస రసం రెడి.
* ఇది వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసుకొని తింటే జలుబు తగ్గిపోతుంది.