రొయ్యలు కూర (Prawns Curry / Royyala Koora)

వంటపేరు : రొయ్యలు కూర


కావలసిన పదార్ధాలు :

రొయ్యలు : 1 కిలో 
ఉల్లిపాయలు : పెద్దవి మూడు 
పచ్చిమిర్చి : నాలుగు
నూనె : కప్పు 
లవంగాలు : నాలుగు 
దాల్చినచెక్క : అంగుళం ముక్క 
యాలకులు : మూడు 
ధనియాలు : రెండు టేబుల్ స్పూన్లు 
గసాలు : రెండు టేబుల్  స్పూన్లు
కరం : రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు : సరిపడ 
కొత్తిమిర : 1 కట్ట
పసుపు : అర టీ స్పూన్
గరం మసాల : అర టీ స్పూన్ 
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు 
కరివేపాకు : రెండు రెమ్మలు
(ధనియాలు, గసాలు ముద్దగా నూరాలి)


తయారుచేయు విధానం :

1) రొయ్యలు బాగా  కడిగి పసుపు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి కలిపి పక్కన 
    పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి, లవంగాలు, చెక్క, కరివేపాకు 
   వేసి వేగిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. 
3) ఇప్పుడు రొయ్యలు వేసి మూతపెట్టాలి. పది నిముషాలకు నీరంతా పోయి 
    రొయ్యలు ఉడుకుతాయి.
4) ఇప్పుడు కొద్దిగా నీళ్ళుపోసి, ధనియాలు, గసాలు ముద్ద వేసి కలిపి రెండు 
    నిముషాలు ఉంచాలి.
5) గరంమసాల, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆపి కొత్తిమిర జల్లి మూత పెట్టాలి. 


* అంతే గుమగుమలాడే రొయ్యలకూర రెడి.