కావలసిన పదార్ధాలు :
సెనగపిండి : అరకేజీ
పచ్చబటానిలు : 100 g
అటుకులు : 100 g
వేరుసేనగ గుళ్ళు : 100g
పచ్చిసేనగ గుళ్ళు : 100g
కారం : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు ఆకులూ : గుప్పెడు
నూనె : అరకేజీ
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం :
1) బటాని, సెనగపప్పు రెండు గంటల ముందు నానబెట్టాలి
2) ఇప్పుడు స్టవ్ వెలిగిచి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి
3) సెనగపిండిని రెండు భాగాలుగా చేసి,
4) ఒక భాగం నీళ్ళతోగట్టిపిండిలా కలిపి జంతికల గొట్టంలో పెట్టి కారప్పూసలా
నూనెలో వేసి తియ్యాలి.
5) మరో భాగం పిండిని కాస్త జారుగా కలిపి, చిల్లుల గరిటెలో పోసి అదే
నూనెలో బూందిలా వేసి తియ్యాలి.
6) ఇప్పుడు అదేనూనేలో, నానబెట్టిన బటానీలు వేసి వేగాక
పక్కనపెట్టుకోవాలి. సెనగపప్పు వేసి తియ్యాలి. తరువాత అటుకులు
కూడా వేపాలి.
7) అదే విధంగా వేరుసెనగగుళ్ళు, కరివేపాకు వేసి వేపాలి.
8) ఇప్పుడు స్టవ్ ఆపి ఇవన్నీ ఒక పళ్ళెంలో పోసి (కారప్పూస, బూంది,
వేపిన సెనగపప్పు, అటుకులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చి బటాణి,
కరివేపాకులు) కారం వేసి బాగా కలిపి డబ్బాలో పోసుకోవాలి.
* అంతే కరకరలాడే బూంది మిక్చర్ రెడి.
Post a Comment