అరటికాయ, సెనగపప్పు కూర (Banan Dal Curry in telugu Aritikaya Senagapappu Fry)

వంటపేరు : 
          అరటికాయ, సెనగపప్పు కూర


కావలసిన పధార్ధాలు :


అరటికాయ : ఒకటి
సెనగపప్పు : వంద గ్రాములు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
వెల్లుల్లి : ఆరు రెబ్బలు
ఉప్పు : తగినంత
పసుపు : కొద్దిగా
కారం : టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు


తయారుచేయు విధానం :


1) సెనగపప్పును పావుగంట నానబెట్టాలి. 
2) అరిటికాయను, ఉల్లిపాయను, పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి 
    పక్కన వుంచాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి పోపుదినుసులు, 
    వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
4) అవి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేపాలి. 
5) ఉల్లిముక్కలు వేగాక, అరటి ముక్కలు, సెనగపప్పు వేసి ఒకసారి బాగా 
    కలిపి మూతపెట్టాలి.
6) చిన్నమంత మీద (సింలో) పది నిముషాలు ఉడికిన తరువాత మూత తీసి 
    ఒకసారి కలిపి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి, కొద్దిగా నీళ్ళుపోసి కాసేపు 
    మూత పెట్టాలి. 
7) కూర పూర్తిగా ఉడికి నీళ్ళు మొత్తం యిగిరి, కూర పొడిపొడిగా అవుతుంది.
8) ఇప్పుడు మసాలాపొడి జల్లి, కొత్తిమిర వేసి స్టవ్ ఆపాలి.