తాలింపు శెనగలు (Spiced Channa in telugu Talimpu Senagalu)

వంటపేరు : తాలింపు శెనగలు


కావలసిన పదార్ధాలు :


శెనగలు : పావుకేజీ
ఆవాలు : టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
కారం : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె : 1 టేబుల్ స్పూన్


తయారుచేయు విధానం :


1) శెనగలు రాళ్ళు లేకుండా శుభ్రం చేసి, కడిగి, రెండు గంటలు నానబెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లో శెనగలు వేసి, కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ 
    మీద పెట్టాలి.
3) రెండు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి. ఆవిరి పోయాక మూతతీసి ఉడికినవో 
    లేవో చూసి, ఉడకకపోతే స్టవ్ వెలిగించి మళ్లీ కాసేపు ఉడక నివ్వాలి.
4) శెనగలులో నీళ్ళు వుంటే వంచి పక్కన పెట్టాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచేయ్యాలి.
6) కాగిన నూనేలో ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, 
    కారం, ఉప్పు వేసి ఉడికిన శెనగలు వేసి కలిపి స్టవ్ ఆపాలి
    (కావాలంటే తినే ముందు ఉల్లి ముక్కలు, నిమ్మరసం వేసుకొని తినొచ్చు)


* అంతే తాలింపు శెనగలు రెడి.