మటన్ కర్రి (Andhra Mutton Curry)

వంటపేరు : మటన్ కర్రి


కావలసిన పదార్ధాలు :


మటన్ : అరకేజీ
ఉల్లిపాయలు : మూడు (చిన్నముక్కలుగా కొయ్యాలి)
పచ్చిమిర్చి : నాలుగు
పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు
కారం : రెండు టీ స్పూన్లు
పసుపు : అరటీ స్పూన్
ఉప్పు : సరిపడ
గరం మసాల : 1 టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా
టమాటాలు : రెండు 
నూనె : 1 కప్పు
లవంగాలి : రెండు
దాల్చినచెక్క : చిన్నముక్క
యలుకులు : రెండు
అల్లంవెల్లుల్లి ముద్ద : 1 టేబుల్ స్పూన్




తయారుచేయు విధానం :


1) మటన్ కడిగి పసుపు, కారం, పెరుగు, అల్లంవెల్లుల్లి కలిపి అర గంట 
    పక్కనపెట్టాలి.
2) బాండిలో నూనె వేడి చేసి చెక్క, లవ్వంగాలు, యాలుకులు వేసి వేగిన 
    తరువాత ఉల్లిముక్కలు వేసి దోరగా వేపాలి.
3) అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేపి, అన్ని 
    కలిపినమటన్ వేసి ఒకసారి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద పది 
    నిముషాలు డకనివ్వాలి.
4) ఇప్పుడు టమాటాలు వేసి మూత పెట్టి, రెండు నిముషాలు ఉడకనివ్వాలి. 
5) మటన్ ఉడికి దగ్గర పడ్డాక, మసాల జల్లి కలిపి, కొత్తిమిర వేసి మూతపెట్టి 
    స్టవ్ ఆపాలి


* అంతే మటన్ కర్రి రెడి.


* ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది.