రవ్వలడ్డు (Ravva Laddu Tayaari in Telugu)

వంటపేరు : రవ్వలడ్డు


కావలసిన పదార్ధాలు :


బొంబాయి రవ్వ : అరకేజీ
పంచదార : అరకేజీ
నెయ్యి : 1 కప్పు
యాలుకల పొడి : 1 టీ స్పూన్ 
కొబ్బరి పొడి : 1 కప్పు


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయిలో నెయ్యి వేడిచేసి, రవ్వను దోరగ వేపాలి.


2) స్టవ్ ఆపి వేడి రవ్వలో పంచదార, కొబ్బరి పొడి, యాలుకల పొడి కలిపి 
    రెండు నిముషాలు ఉంచాలి.


3) రవ్వ వేడికి పంచదార కరిగి కొద్దిగా తడి అవ్వుతుంది. 


4) ఇప్పుడు బాగా కలిపి ఉండలు చుట్టుకోవడమే.




* ఇవి పది రోజులు నిల్వ వుంటాయి.