వంటపేరు : ఆనబకాయ దప్పళం
కావలసిన పదార్ధాలు :
ఆనబకాయ : ఒకటి (చిన్నది )
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: తగినంత
కారం : 1 టీ స్పూన్
బెల్లం : వంద గ్రాములు
చింతపండు : వందగ్రాములు
కొత్తిమిర : కొద్దిగా
కరివేపాకు : రెండు రెమ్మలు
పోపుదినుసులు : 1 టేబుల్ స్పూన్
ఎండిమిర్చి : రెండు
పసుపు : అర టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) ఆనబకాయను పెద్దముక్కలుగా కొయ్యాలి
2) ఒక గిన్నెలో ఆనబముక్కలు, ఉల్లి, మిర్చిముక్కలు, కారం, ఉప్పు,
పసుపు, కొంచెం కొత్తిమిర, బెల్లం వేసి బాగా కలిపి ముక్కలు మునిగేలా
నీళ్లుపోసి మూత పెట్టి స్టవ్ పై ఉడకనివ్వాలి.
3) పది నిముషాలు ఉడికిన తరువాత మూత తీసి, చింతపండు రసం
పొయ్యాలి. మరో పది నిముషాలు ఉడికించాలి
4) తరువాత దించి, అదే స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపు
దినుసులు వేసి వేగాక, ఎండి మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక,
ఉడికిన ఆనబకాయ దప్పళం, తాలింపులో వేసి మిగిలిన కొత్తిమిర జల్లి
మూత పెట్టాలి.
* అంతే ఆనబకాయ దప్పళం రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te