పప్పు టమాట (Pappu Tamata / Tomato Dal)

వంటపేరు : పప్పు టమాట
కావలసిన పదార్ధాలు :


కందిపప్పు : 100 గ్రాములు 
టమాటాలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
ఉల్లిపాయ : ఒకటి
పసుపు : 1/2   టీ స్పూన్
కారం : 1 టీ స్పూన్
ఉప్పు : తగినంత 
పోపుదినుసులు : 1 టేబుల్ స్పూన్
నూనె : తాలింపు వెయ్యటానికి  సరిపడా
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమిర : కొద్దిగా
జీలకర్ర, వెల్లుల్లి : కొద్దిగా
తయారుచేయు విధానం :


1) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కరు పెట్టి కందిపప్పు, టమాట, మిర్చి, 
     పసుపు, కారం, జీలకర్ర, వెల్లుల్లి (కొద్దిగా చిదిమి) వేసి గ్లాసు నీళ్ళుపోసి 
     మూత పెట్టాలి.
2) మూడు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి.
3) ఇప్పుడు కుక్కరు ఆవిరి పోయిన తరువాత మూత తీసి, ఉప్పు వేసి 
     మెత్తగా మెదిపి తిప్పాలి. 
4) నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగిన తరువాత కరివేపాకు వేసి 
    వేగాక, పప్పు కలిపి కొత్తిమిరవేసి మూత  పెట్టాలి.


* అంతే పప్పుటమాట రెడి.