చెక్కర పొంగలి (Ckekkara Pongali)

కావలసిన పదార్ధాలు :


బియ్యం : అరకిలో
పంచదార : ముప్పావు కిలో పసరపప్పు : పావుకిలో
యాలకులు : 10 గ్రాములు  
జీడిపప్పు : 50 గ్రాములు 
కిస్మిస్లు : 50  గ్రాములు  
నెయ్యి : 150  గ్రాములు 
ఉప్పు : 1 టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) పెసరపప్పును దోరగా వేపాలి.
2) ఇప్పుడు బియ్యం, పెసర పప్పు కడిగి రెండొంతుల నీళ్ళుపోసి కుక్కర్లో వేసి 
     స్టవ్ మిద పెట్టాలి.
3) ఇప్పుడు వేరే గిన్నెలో పంచదార వేసి గ్లాసు నీళ్ళు పోసి మరో స్టవ్ పై పెట్టి 
     పంచదార తీగ పాకం పట్టాలి. 
4) పాకం వచ్చాక ఉడికిన అన్నంలో పోసి కలపాలి.
5) ఇప్పుడు నెయ్యి వేడి చేసి జీడిపప్పులు, కిస్మిస్లు వేపి నెయ్యి తోసహ 
    ఉడుకుతున్న అన్నంలో వేసి సింలో కాసేపు వుంచి మిగిలిన నెయ్యి, 
    ఉప్పు, యాలుకలపొడి వేసి కలిపి స్టవ్ ఆపాలి.