పచ్చిమిరపకాయల బజ్జి (Mirchi Bujji / Mirapakaya Bajjeelu)

వంటపేరు : పచ్చిమిరపకాయల బజ్జి


కావలసిన పదార్ధాలు :

లావు పచ్చిమిర్చి : పది
సెనగపిండి : పావుకేజీ
వంటసోడా : చిటికెడు
ఉప్పు : సరిపడ
వామ్ము : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : పావుకేజీ


తయారుచేయు విధానం :

1) పచ్చిమిర్చిని నిలువుగా ఒక ప్రక్క కోసి లోపల గింజలు తీసివెయ్యాలి.
2) ఉప్పు, కొద్దిగా వామ్ము కలిపి గింజలు తీసిన పచ్చిమిరపకాయల్లో పెట్టాలి.
3) ఇప్పుడు సెనగపిండిలో నీళ్ళుపోసి ఉప్పు, సోడా కలిపి చిక్కగా 
    పిండి కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేయ్యాలి.
5) నూనె కాగిన తరువాత, వామ్ముపెట్టిన పచ్చిమిరపకాయను సెనగపిండిలో
    ముంచి కాగే నూనెలో వెయ్యాలి.
6) గరిటతో తిప్పుతూ వేగిన తరువాత తీసి పేపరు పరచిన ప్లేటులోకి 
    తీసుకోవాలి

* అంతే నోరూరించే మిరపకాయ బజ్జీలు రెడి.