కావలసిన పదార్దాలు :
కారం : టీ స్పూన్
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
మైదా : పావుకప్పు
కార్న్ ఫ్లోర్ : టేబుల్ స్పూన్
కోడిగుడ్డు : ఒకటి
కలర్ : కొద్దిగా
పెరుగు : అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టూ : టీ స్పూన్
గరం మషాలా : అర టీ స్పూన్
పచ్చిమిర్చి : ఐదు నిలువుగా కట్
చెయ్యాలి.
కరివేపాకు : కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడ
తయారుచేయు విదానం :
1) ముందుగా మటన్ లో ఉప్పు, పసుపు వేసి
ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2) ఉడికించిన మటన్ లో కారం, ఉప్పు, పసుపు, మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం పేస్టూ, గరం మసాలా, కోడిగుడ్డు వేసి కలపాలి.
3) ఇప్పుడు నూనె వేడి చేయ్యాలి. నూనె కాగాక అన్ని కలిపిన మటన్ ను పకోడిలుగా వేసి దోరగా వేయించి ప్లేటులోకి తీసుకోని పక్కన పెట్టాలి.
4) వేరే కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయ్యాలి. నూనె వేడి అయ్యాక నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
5) అవి వేగాక పెరుగు వేసి కలపాలి. దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలిపి దానిలో పకోడిలుగా వేయించిన మటన్ వేసి బాగా కలపాలి.
6) పెరుగు మొత్తం ఇగిరి పోయాక ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
7) వేయించిన కరివేపాకు, ఉల్లి చక్రాలు తో అలంకరించి సర్వ్ చెయ్యాలి.
మటన్ సిక్స్టి ఫైవ్ రెడి.
Post a Comment