మష్రూమ్స్ (పుట్టగొడుగులు ) మెంతుకూర(Mushrooms Mentu Lives Curry in Telugu )



కావలసిన పదార్దాలు:

మెంతుఆకు : కప్పు
మష్రూమ్స్ : వంద గ్రాములు
ఉల్లిముక్కలు : అర కప్పు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
దనియాల పొడి : టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టూ : టేబుల్ స్పూన్
గసగసాలు పేస్టు : పావుకప్పు
కరివేపాకు : కొద్దిగా
నూనె : అరకప్పు
పసుపు : కొద్దిగా
కొబ్బరి పేస్టు  : పావు కప్పు
పెరుగు : అర కప్పు

తయారుచేయు విధానం :

1) ముందుగా మష్రూమ్స్ ను వేడి నీళ్ళల్లో వేసి ఒక నిముషం ఉంచి తియ్యాలి.

2) ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి.

3) కరివేపాకు వేసి వేగాక  ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

4) తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత మెంతుఆకు వేసి వేయించాలి.

5) దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి తరువాత  దనియాల పొడి, కొబ్బరి పేస్టు, గసగసాలు పేస్టు, పెరుగు వేసి కలపాలి.ఒక నిముషం ఉడకనివ్వాలి.

6) ఒక నిముషం తరువాత ఇప్పుడు మష్రూమ్స్ వేసి బాగా కలిపి ఒకగ్లాస్ నీళ్ళుపోసి ఉడికించాలి.
ఇదు నిముషాలకు కూర రెడి అవ్వుతుంది.

7) కూర దించే ముందు  కొత్తిమీర, గరంమసాలా వేసి  స్టవ్ ఆపాలి.