చికెన్ : కిలో (కోడి )
పెరుగు : పావుకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు: రెండు టీ స్పూన్
కారం : రెండు టీ స్పూన్లు
ఉప్పు : సరిపడ
మసాలా పొడి : టీ స్పూన్
పుదినా : చిన్న కట్ట
కొత్తిమీర : కట్ట
నిమ్మకాలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
నూనె : రెండు కప్పులు
తయారుచేయు విధానం :
1) కోడిని శుబ్రం చేసి దాని చర్మాని జాగ్రత్తగా వేరు చెయ్యాలి.
2) చర్మాన్ని నాలుగు నలుచదరపు ముక్కలుగా చెయ్యాలి.
3) కారం, ఉప్పు, మసాలాపొడి, కొత్తిమీర, పుదినా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అన్ని కలిపి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
4) ఇప్పుడు చికెన్ లో గట్టి పెరుగు, ముద్దగా చేసిన మసాలాలు వేసి బాగా కలపాలి.
5) ఇలా చేసిన చికెన్ ను ఒక గంట నాననివ్వాలి.
6) ఇప్పుడు ఈ చికెన్ కొద్ది కొద్దిగా తీసుకోని చికెన్ చర్మం లో వేసి పొట్లం లా చుట్టి దారంతో కట్టాలి. ఇలా అన్ని చేసాక ఒక ప్లేటులో పెట్టాలి.
7) స్టవ్ ఫై పాన్ పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఈ పొట్లాలను వేసి వేయించాలి.
8) ఇవి ఎర్రగా అయ్యాక ప్లేటులోకి తీసుకోవాలి.
అంతే చికెన్ పాకెట్ కర్రీ రెడి.
9) వీటిని అలాగే తినవచ్చు, లేదా
చికెన్ గ్రేవితో కలిపి రైస్ లో తినవచ్చు.
Post a Comment