కావలసిన పదార్దాలు:
బెంగాళ దుంపలు : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
మషాలా పొడి : పావు టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : రెండు చిటికెలు
తయారు చేయు విధానం:
1) బంగాళా దుంపలు చెక్కు తీసి చిన్నగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) నూనె కాగాక చిన్నగా కట్ చేసిన దుంప ముక్కలు వేసి వేయించాలి.
4) అవి వేగుతుండగా ఒక గిన్నెలోకి గుడ్లు కొట్టి సోన వేసి బాగా కలపాలి .
5) ఇప్పుడు వేగు తున్న దుంపల్లో ఈ గుడ్డు సొన వేసి కలుపుతూ ఉండాలి.
6) ఇవిబాగా వేగిన తరువాత కారం, ఉప్పు, పసుపు, మషాలా పొడి వేసి బాగా కలిపి ఒక నిముషం అయ్యాక స్టవ్ ఆపాలి.
అంతే ఆలూ గుడ్లు పొరటు (పుల్టా) రెడి .
Post a Comment