రొయ్యలు, పెరుగు కూర (Frawns Curd Curry in Telugu )


కావలసిన పదార్దాలు :

పచ్చిరొయ్యలు : అరకేజి
పెరుగు : అర కప్పు 
మషాలా పొడి : అర టీ స్పూన్
పచ్చిమిర్చి : మూడు
ఉల్లి ముక్కలు : అర కప్పు
టమాటా : ఒకటి
ఉప్పు : తగినంత
కారం :టీ స్పూన్
పసుపు : కొద్దిగా
నూనె : అర కప్పు 
గసగసాలు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్టూ  : టీ స్పూన్
కొత్తిమీర : కట్ట
కొబ్బరిపొడి : రెండు టీ స్పూన్లు

తయారుచేయు విధానం :

1) రొయ్యలు పొట్టు తీసి కడిగి శుబ్రం చెయ్యాలి.

2) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు, వేసి వేయించాలి.

3) అవి వేగాక టమాటా ముక్కలు వేసి మెత్త బడే వరకు ఉంచాలి.

4) ఇప్పుడు రొయ్యలు వేసి కాసేపు వేయించాలి.తరువాత  కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

5) ఐదు నిముషాలు ఉడికాక అల్లం పేస్టూ, కొబ్బరి పొడి, గరం మషాలా వేసి ఐదు నిముషాలు మూత పెట్టి ఉడికించాలి.

6) ఐదు నిముషాలు అయ్యాక పెరుగు కలిపి స్టవ్ ఆపాలి. 

7) దించేముందు కొత్తిమీర వేసి కలిపి దించాలి.

అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యలు పెరుగు కూర రెడి.