కావలసిన పదార్దాలు:
బియ్యం : అర కేజీ
కోడిగుడ్లు : ఆరు
కొత్తిమీర : కట్ట
పుదినా : అర కట్ట
పచ్చిమిర్చి : ఆరు
ఉల్లిపాయ : మూడు
లవంగాలు, చెక్క, యాలుకలు : అన్ని కలిపి పది
జీడిపప్పు : పది
పచ్చిబఠాణీ : అర కప్పు
వెల్లుల్లి రేకలు : ఆరు
అల్లం ముక్క : చిన్న ముక్క
పసుపు : చిటికెడు
మిరియాల పొడి : చిటికేడు
ఉప్పు : తగినంత
నెయ్యి : అర కప్పు
నూనె : అర కప్పు
కొబ్బరి కాయ: ఒకటి
మసాలా ఆకు : ఒకటి
మసాలా ఆకు : ఒకటి
తయారుచేయు విధానం :
1) కొబ్బరి పాలు తీసుకోని పక్కనపెట్టండి. అల్లం
వెల్లుల్లి ముద్దగా నూరండి.
2) పుదినా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె, నెయ్యి కలిపి వేడి చెయ్యండి.
4) కాగిన నూనె నేతిలో మషాలాలు , జీడిపప్పు, వేసి వేయించాలి.
అవి వేగాక ఉల్లి ముక్కలు,మిర్చిముక్కలు అల్లం వెల్లుల్లి ముద్దవేసి వేగాక
పుదీనా, కొత్తిమీర, మషాలా ఆకు వేసి కలిపి కొబ్బరి పాలు,అర లీటరు నీళ్ళు వేసి ఉప్పు పసుపు కలిపి మూత పెట్టాలి.
5) ఇప్పుడు కడిగి నీళ్ళు వంచిన బియ్యం మరుగు తున్న కొబ్బరి పాలులో వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి.
6) ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లుకొట్టి వెయ్యండి ఈ గుడ్డు సోనలో
మిరియాలపొడి కలిపాలి.
7) ప్ర క్క స్టవ్ ఫై పాన్ పెట్టి ఈ గుడ్డు సొనను ఆమ్లెట్ లా వేసి రెండు
ప్రక్కలా కాలనివ్వలి.
8) ఈ అమ్లేట్లు ను మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్చేసి
ఉడుకుతున్న అన్నంలో ఈ ఆమ్లెట్ ముక్కలు, పచ్చి బఠాని వేసి ఒక సారి కలిపి మూత పెట్టండి.
9) ఐదు నిముషాలకు ఎగ్ కొబ్బరి రైస్ రెడి.
Post a Comment