క్యాబేజి వేపుడు(Cabbage Fry in Telugu )

కావలసిన పదార్దాలు :

క్యేబెజి : ఒకటి(చిన్నది )
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కారం : కొద్దిగా
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
ఎండు మిర్చి : రెండు
వెల్లుల్లి రెబ్బలు : ఐదు
పోపుదినుసులు : కొద్దిగా
కరివేపాకు : రెండు రెమ్మలు

తయారుచేయువిధానం:

1) క్యాబేజి ను సన్నగా కాడలుగా కట్ చెయ్యాలి .
2) వీటిని పసుపు ,ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. నీళ్ళు పోయేలా చిల్లుల పళ్ళెం లో వేసి వార్చాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వెడి  చేసి ముందుగా పోపుదినుసులు(ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు) వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఉడికించిన క్యాబేజి ముక్కలు వేసి వేయించాలి.

4) కాసేపు వేగాక కారం, పసుపు, ఉప్పు వేసి ఒక నిముషం ఉంచి తడి లేకుండా వేగాక దించుకోవాలి .
అంతె క్యాబేజి వేపుడు రెడి.