కావలసిన పదార్దాలు :
మాంసం : అరకిలో
వంకాయలు : రెండు
చింత చిగురు : కప్పు
ఉల్లిపాయలు : ఒకటి
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : తగినంత
కారం : అర టీ స్పూన్
నూనె : అర కప్పు
అల్లం : చిన్నముక్క
వెల్లుల్లు రెబ్బలు : నాలుగు
తయారుచేయు విధానం :
1) ముందుగా అల్లం,
వెల్లుల్లి, చెక్క, లవంగాలు కలిపి ముద్దగా నూరుకోవాలి.
2) ఉల్లి, మిర్చి, వంకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె పోసి కాగాక ఉల్లి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక మాంసం ముక్కలు వెయ్యాలి.
4) కాసేపు నూనెలో ఉడికి నీరంతా ఇగిరి పోయాక ఉప్పు, కారం వేసి కలిపి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి.
5) ఐదు నిముషాలు ఉడికాక వంకాయ ముక్కలు వేసి కలిపి ముత పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.
6) ఇప్పుడు కూర లో నీళ్ళు సగం ఇగిరాక చింత చిగురు వేసి రెండు నిముషాలు ఉడికిస్తే కూర రెడి అవ్వుతుంది .
7) ఇప్పుడు నూరిన మసాలా ముద్ద వేసి కలిపి మూత పెట్టాలి.
ఒక నిముషం ఆగి స్టవ్ ఆపాలి.
Post a Comment