సేమ్యా చికెన్ బిర్యాని (Semiya Chiken Biryani in Telugu)

కావలసిన పదార్దాలు :

సేమ్యా : మూడొందల గ్రాములు
చికెన్ : కిలో
నెయ్యి : కప్పు
ఉప్పు : తగినంత
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి : మూడు
ఉల్లి పాయలు : మూడు
గరం మషాలా : రెండు టీ స్పూన్లు
లవంగాలు : ఆరు
జీడిపప్పు : పది
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
యాలుకలు : నాలుగు
టమాటాలు : మూడు
కొత్తిమీర : ఒక కట్ట
పసుపు : కొంచెం
కిస్మిస్ : కొద్దిగా
కారం : రెండు స్పూన్లు
సోయాబిన్ సాస్ : రెండు స్పూన్లు
కరివేపాకులు : కొద్దిగా

తయారుచేయు విధానం :

1) ముందుగా చికెన్ శుబ్రం చేసి కావలసిన సైజులో ముక్కలు చెయ్యాలి.

2) నెయ్యి వేడిచేసి సేమ్యాను దోరగా వేయించండి.

3) తరువాత జీడిపప్పులు, కిస్మిస్లు నేతిలో వేయించి పక్కన పెట్టండి.

4) మరికాస్త నెయ్యి వేసి దానిలో లవంగాలు, యాలుకలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి.అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.


5) ఇప్పుడు చికెన్ ముక్కలు, టమాట ముక్కలు వేసి ఒక సారి కలిపి దీనిలో కారం, గరం మషాల,ఉప్పు వేసి చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచలి.

6) ఇప్పుడు వేయించిన సేమ్యా  వేసి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి.
7) నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక జీడిపప్పు, కిస్మిస్లు, సోయాబిన్ సాస్ వేసి కలిపి పోడి పొడిగా అయ్యేదాకా ఉంచి కొత్తిమీర చల్లి వడ్డించండి.