చికెన్ లివర్ కూర (Chicken Liver Curry in Telugu )


కావలసిన పదార్దాలు :


చికెన్ లివర్ : పావుకిలో 
కొబ్బరి : పావు కప్పు 
గరం మషాలా : అర టీ స్పూన్ 
పసుపు : అర స్పూన్ 
ఎండు మిర్చి : ఆరు 
వెల్లుల్లి : ఒకటి 
జీలకర్ర : రెండు స్పూన్లు 
ఉప్పు : సరిపడ
ఉల్లి పాయలు : మూడు
టమాటాలు : రెండు 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు 

తయారుచేయు విధానం: 

1) టమాటాలు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2) కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, మషాలా, వెల్లుల్లి కలిపి ముద్దలా నూరుకోవాలి.

3) చికెన్ లివర్ కడిగి పక్కన పట్టాలి.

4) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేదిచేయ్యాలి. 

5) నెయ్యి కాగాక ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి.

6) ఉల్లి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి  మగ్గనివ్వాలి.

7) ఇప్పుడు ముద్దలా నూరిన మషాలా వేసి కలపాలి.

8) ఇప్పుడు శుబ్రం చేసిన చికెన్ లివర్ వేసి నెమ్మదిగా కలిపి కొద్దిగా నీళ్ళుపోసి నీళ్ళు యిగిరెంత వరకు ఉడికించాలి.

9) దించేముందు కొత్తిమీర జల్లి స్టవ్ ఆపాలి.