కుల్ఫీ(Kulfi Milk Sweet in Telugu)కావలసిన పదార్దాలు :

పాలు : అర లీటరు (చిక్కగా మరిగించినవి)
నీళ్ళు : ఒక  గ్లాస్
పంచదార పొడి : ఆరు టేబుల్ స్పూన్లు
కర్నఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు 
కోవా : రెండు టేబుల్ స్పూన్లు
టోనోవిన్  ఎసెన్స్ : ఏడు  చుక్కలు 
యాలుకలు పొడి : అర టీ స్పూన్ 
ఉప్పు : చిటికెడు 


తయారుచేయు విధానం :

1) పాలు చిక్కగా మరిగించి చల్లారిన తరువాత వాటిలో కాన్ ఫ్లోర్ , టోనోవిన్ ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా పలుచగా కలిపి పక్కనపెట్టాలి.

2) స్టవ్ ఫై నీళ్ళు మరగబెట్టి  దానిలో పంచదార , ఉప్పు వేసి కరిగించాలి.

3) ఇప్పుడు దీనిలో ఉండలు లేకుండా కాన్  ఫ్లోర్ కలిపిన పాలు పోసి కలుపుతూ చిన్న మంటమీద ఉడికించాలి.

4) ఈమిశ్రమం చిక్కగా అయిన తరువాత గిన్నెను దించాలి.

5)  ఇప్పుడు ఒక స్టిల్ గిన్నెను తీసుకోని దానిలోపల ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని పోసి ఫ్రీజర్ లో ఐదు గంటలు 
ఉంచాలి.ఇప్పుడు కుల్ఫీ రెడి అవ్వుతుంది.

6) తరువాత బయటకు తీసి కాసేపు గాలికి ఆరనివ్వాలి.

7) తరువాత ఒక ప్లేటు తీసుకోని దానిమీద కుల్ఫీ ఉన్న గిన్నెను బోర్లించి వెనుక బాగంలో నెమ్మదిగా(కొడితే ) తడితే గిన్నె ఆకారంలో  వస్తుంది.

8) అప్పుడు మనకు కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని అతిధిలకు అందించటమే.