కావలసిన పదార్దాలు :
మట్టగిడసలు : అర కిలో
ఉప్పు : సరిపడ
కారం : టీ స్పూన్
పసుపు : చిటికెడు
లవంగాలు : మూడు
చెక్క: చిన్న ముక్క
యాలుకలు : రెండు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : ఆరు
ఉల్లి పాయలు : మూడు
పచ్చిమిర్చి : నాలుగు
నూనె : కప్పు
కర్వేపాకు : కొద్దిగా
కొత్తిమీర : అర కట్ట
టమాటాలు : రెండు
తయారుచేయు విధానం:
1) చేపల్ని శుబ్రం చేసి కడిగి వాటికి ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టండి.
2) చెక్క, లవంగాలు, యాలుకలు. వెల్లుల్లి, ఉల్లి పాయలు ముద్దగా నూరండి.
3) పచ్చిమిర్చి నిలువుగా కట్చెయ్యండి.
4) ఇప్పుడు స్టవ్ ఫై నూనె వేడి చేసి కాగాక కర్వేపాకు, పచ్చిమిర్చి వేసి వేపి అల్లం ఉల్లి ముద్ద వేసి వేయించండి.ఇప్పుడు టమాట ముక్కలు వేసి ఒక నిముషం వేగానివ్వండి.
5) టమాట, ఉల్లి ముద్ద వేగాక, కారం కలిపిన మట్టగిడసలు (చేపలు) వేసి ఒకసారి కలిపి చేపలు మునిగేలా నీళ్ళు పోసి ఉడికించండి.
6) పది నిముషాల ఉడికిన తరువాత కూర రెడి .
ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆపండి.
అంతే మట్టగిడసల ఇగురు రెడి.
Post a Comment